APEX-CCB 16 వ తెలుగు పుస్తక సమీక్ష (16th Telugu Book Review Meet) Online
Details
APEX-CCB 16 వ తెలుగు పుస్తక సమీక్ష కార్యక్రమం వివరాలు
అంశం: ’కలాం తో కాసేపు…’ పుస్తక పరిచయం
విశ్లేషణ : పుస్తక రచయిత *ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్
Title: ‘Kalam tho Kasepu …’
Reviewer: Prof.Duggirala Raja Kishor (Author of the book)
7.00 PM - Meeting starts ( Introducing the Guest Speaker to the audience)
7.05 PM - Review starts
7.40 PM - Interaction and Q&A with audience
8.00 pm - Meeting ends
*ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్, కవుల కుటుంబం లో జన్మించారు.
బాల్యం నించి ఆ వాతావరణం లో నే పెరిగారు . వృత్తి రీత్యా కంప్యూటర్ సైన్స్ లో ప్రొఫెసర్ .
ప్రవృత్తి రీత్యా రచయిత. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎం.ఏ స్టాటిస్టిక్స్ , జ్ న్ టి యూ నించి కంప్యూటర్ సైన్సులో PhD చేసి ప్రస్తుతం ఎల్ బుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
Computer Society of India లో జీవిత సభ్యాలుగా ఉన్నారు.నేషనల్ బుక్ ట్రస్ట్ లో 2018 - 2021 కాలములొ తెలుగు భాషా సలహా మండలి సభ్యులు గా చేశారు.
గత 30 సంవత్సరాలుగా Andhra Bhoomi, Andhra Prabha, శ్రీ పీఠం మొదలైన అనేక పత్రికలలో వివిధ అంశాలపై వ్యాసాలు ప్రచురించారు.
ఇంటర్నెట్ లో “రాజసులోచనం” అనే పేరుతో బ్లాగ్ నిర్వహిస్తూ పలు అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు.
వాషింగ్టన్ డీసీ నుంచి ప్రసారం అయ్యే ‘ My India’ Radio లో మే 2019 నించి మార్చి 2020 వరకు ప్రతి శుక్రవారం పర్యావరణం పై ప్రసంగించారు.
యూట్యాబ్ లో “రాజసులోచనం” చానెల్ లో వివిధ అంశాలపై ప్రసంగాలు చేశారు. అదే యూట్యూబ్ లో ‘కథాసుధ’ ఛానల్ లో యెన్నో స్ఫూర్తి దాయక కథలు అందిస్తున్నారు.
ఇక రచయిత గా పర్యావరణం పై 3 పుస్తకాలు రాశారు. ‘పర్యావరణమా- పర్యామరణమా?’ పుస్తకం కన్నడ భాషలోకి అనువదించారు.
పద ముందుకు, భారత దేశం-వివేకానంద, ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం, కలాం తో కాసేపు తదితర రచనలు చేసారు.
‘కలాం తో కాసేపు’ అనేది అధ్యయన రచన, ఇది సెప్టెంబర్ 6, 2025 లో
ప్రచురితం అయ్యింది.
Confirmation of attendance to be conveyed by 19th Nov, 2025.
Link shall be shared to Members of APEX CCB, who have marked their RSVP and to guests subject to organisers discretion and decisions .Let’s connect over constructive discussions!Looking forward to see you.
